: భార్యతో ఫోన్లో మాట్లాడుతూ అపార్ట్ మెంట్ బాల్కనీ నుంచి కింద పడ్డ ఐటీ ఉద్యోగి... కాసేపటి తర్వాత మృతి
ఆస్ట్రేలియాలో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగి పంకజ్ షా ఇండియాలో ఉన్న తన భార్యతో ఫోన్ లో మాట్లాడుతూ సంతోషంగా ఉన్న సమయంలో, విషాదం చోటు చేసుకుంది. అపార్ట్ మెంట్ బాల్కనీ నుంచి ఆయన జారి పడ్డారు. ఈ ఘటనలో ఆయన తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇరుగుపొరుగువారు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఉపయోగం లేకపోయింది. హాస్పిటల్ కు చేరుకున్న కాసేపటికే ఆయన మృత్యువు పాలయ్యారు. నార్త్ సిడ్నీలోని ఐటీ కంపెనీలో పనిచేస్తున్న పంకజ్ ఇటీవలే పెళ్లి చేసుకుని, తిరిగి ఆస్ట్రేలియా వెళ్లారు.