: కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకురండి: టీ కాంగ్ నేతలకు డిగ్గీ రాజా పిలుపు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దిగ్విజయ్ సింగ్ టీ-కాంగ్ నేతలకు పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల పార్టీ నేతలతో సమావేశం కోసం నేటి ఉదయం హైదరాబాదు వచ్చిన ఆయన గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ నేతలనుద్దేశించి ప్రసంగించారు. ఈ నెలాఖరు నాటికి పార్టీ సభ్యత్వ నమోదును పూర్తి చేయాలన్న డిగ్గీ రాజా, పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. డిగ్గీరాజాతో భేటీ అయిన వారిలో టీ పీసీపీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత జానారెడ్డి తదితరులున్నారు.