: ఆందోళనకు దిగిన ఆర్టీసీ కార్మికులు... హైదరాబాద్ లో బస్ సర్వీసులకు ఆటంకం


తెలంగాణలో ఎన్జీవోల జీతాలు పెంచడంతో... ఆర్టీసీ ఉద్యోగులు కూడా తమకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ఆందోళనకు దిగారు. ఆర్టీసీ కార్మిక సంఘాలు టీఎంయూ, ఈయూలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. దీంతో, హైదరాబాదులో బస్ సర్వీసులకు ఆటంకం ఏర్పడింది. ఆందోళనలో భాగంగా బస్ భవన్ ముట్టడి, ఇందిరాపార్క్ వద్ద సభ నిర్వహణ వంటి కార్యక్రమాలను చేపట్టారు. ఇప్పటికే ఆర్టీసీ రూ.3000 కోట్ల నష్టాలలో ఉండటంతో, ఏం చేయాలన్న విషయంపై ప్రభుత్వ వర్గాలు తర్జన భర్జన పడుతున్నాయి.

  • Loading...

More Telugu News