: జ్వరం, శ్వాసకోశ సమస్యలతో ఐసీయూలో జశ్వంత్ సింగ్
గతేడాది ఆగస్టులో తలకు తీవ్ర గాయమైనప్పటి నుంచి కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కోమాలోనే వున్నారు. కొన్నాళ్లు ఆసుపత్రిలో చికిత్స జరిగిన తర్వాత ఆయనను అదే స్థితిలో కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకువెళ్ళారు. కాగా, రెండు రోజుల కిందట జ్వరం, శ్వాసకోశ సమస్యలు తలెత్తడంతో ఆయనను ఢిల్లీలోని ఆర్మీ రీసర్చ్ అండ్ రెఫరల్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం జశ్వంత్ ను ఐసీయూలో వుంచి చికిత్స చేస్తున్నారు. "ఐసీయూలో ఆయనకు కృత్రిమ శ్వాస అందిస్తున్నాము. అయితే పరిస్థితి నిలకడగానే ఉంది. త్వరలోనే ఐసీయూ నుంచి బయటికి వస్తారు" అని ఆసుపత్రికి చెందిన సీనియర్ వైద్యుడు ఒకరు తెలిపారు.