: మంత్రి పోచారంకు హార్ట్ ఆపరేషన్... పేస్ మేకర్ అమరిక


తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డికి హార్ట్ ఆపరేషన్ జరిగింది. గుండె సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్న ఆయనకు కేర్ ఆసుపత్రి వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు. కీ హోల్ సర్జరీ ద్వారా ఆయనకు పేస్ మేకర్ అమర్చారు. డాక్టర్ సోమరాజు, డాక్టర్ నరసింహన్ ల పర్యవేక్షణలో ఆయనకు వైద్య చికిత్సలు అందిస్తున్నట్టు కేర్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. శస్త్ర చికిత్స చేయించుకున్న పోచారంను మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి పరామర్శించారు.

  • Loading...

More Telugu News