: ఉత్తరాఖండ్ లో భూకంపం... భయంతో పరుగులు తీసిన ప్రజలు
ఉత్తరాఖండ్ లో ఈ ఉదయం భూకంపం సంభవించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదైందని ఇక్కడి చమోలీ జిల్లాలోని భూకంప కేంద్రం తెలిపింది. అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఈ చర్యతో ఇళ్లల్లో ఉన్న ప్రజలు భయంతో ఒక్కసారిగా బయటికి పరుగులు తీశారు. ఎలాంటి ఆస్తి నష్టంగానీ, ప్రాణ నష్టంగానీ జరగలేదని తెలిసింది.