: పట్టుబడి, బెయిల్ పై విడుదలై... కాల్పులకు తెగబడ్డ దోపిడీ దొంగ ఇర్ఫాన్!


నల్గొండ జిల్లా సూర్యాపేటలో రాత్రి జరిగిన కాల్పులకు పాల్పడ్డ దోపిడీ దొంగలకు సంబంధించి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ కు చెందిన దోపిడీ ముఠానే ఈ ఘటనకు కారణమని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. తాజాగా హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మరో ఆసక్తికర కోణాన్ని వినిపించారు. నాయిని వాదన ప్రకారం... 15 రోజుల క్రితం సీఐ మొగులయ్య, ఉత్తరప్రదేశ్ కు చెందిన దోపిడీ ముఠాను అరెస్ట్ చేశారు. ముఠాలో ఏడుగురు సభ్యులుంటే, వారిలోని ఐదుగురిని మొగులయ్య కటకటాల వెనక్కు నెట్టారు. అయితే అరెస్టైన దొంగల్లోని ఇర్ఫాన్ అనే వ్యక్తి ఇటీవల బెయిల్ పై విడుదలయ్యాడు. విడుదలైన ఇర్ఫాన్, మరో వ్యక్తితో కలిసి రాత్రి మొగలయ్య, ఆయన సిబ్బందిపై విరుచుకుపడ్డాడట. అయితే నిందితులు పట్టుబడితేనే అసలు వ్యవహారం తేలుతుందని పోలీసులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News