: కానిస్టేబుల్ కుటుంబానికి రూ.40 లక్షలు, హోంగార్డు కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం: నాయిని


నల్గొండ జిల్లా సూర్యాపేటలో అర్ధరాత్రి చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో చనిపోయిన పోలీసుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాదులోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీఐ, కానిస్టేబుళ్లను పరామర్శించిన తెలంగాణ హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పరిహారానికి సంబంధించిన ప్రకటన చేశారు. దొంగల కాల్పుల్లో మరణించిన కానిస్టేబుల్ లింగయ్య కుటుంబానికి రూ.40 లక్షల పరిహారాన్ని ప్రకటించిన నాయిని, హోంగార్డు మహేశ్ కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియాను ఇవ్వనున్నట్లు తెలిపారు. అంతేకాక ప్రభుత్వ నిబంధనల మేరకు ఇతర ప్రయోజనాలను కూడా బాధిత కుటుంబాలకు అందిస్తామని నాయిని ప్రకటించారు.

  • Loading...

More Telugu News