: ఆ నిజాయతీ అధికారి మరోసారి బదిలీ అయ్యారు!


నిజాయతీకి మారుపేరుగానే కాక అక్రమార్కుల పాలిట సింహస్వప్నంలా పనిచేసే సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా మరోసారి బదిలీకి గురయ్యారు. ఇప్పటికే తన నిజాయతీతో లెక్కకు మిక్కిలి బదిలీలకు గురైన ఆయన, హర్యానాలో తొలిసారిగా కొలువుదీరిన బీజేపీ సర్కారులోనైనా కాస్త నింపాదిగా పనిచేసుకునే వెసులుబాటు లభిస్తుందని అంతా అనుకున్నారు. ఎందుకంటే, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూదాహాన్ని వెలికితీసిన ఆయన పట్ల బీజేపీ అమితాసక్తి కనబరిచింది. అయితే, తానూ ఓ రాజకీయ పార్టీనే అని నిరూపించుకుంది బీజేపీ. హర్యానా ట్రాన్స్ పోర్టు కమిషనర్ గా పనిచేస్తున్న ఆయనను అక్కడి నుంచి బదిలీ చేసి, పురవాస్తు శాఖ డైరెక్టర్ జనరల్ బాధ్యతలు అప్పగించింది. అంతేకాక తక్షణమే బదిలీ ఉత్తర్వులు అమలులోకి వస్తాయంటూ నిన్న జారీ చేసిన ప్రకటనలో మనోహర్ లాల్ ఖట్టర్ సర్కారు పేర్కొంది.

  • Loading...

More Telugu News