: లక్ అంటే ఇంగ్లండ్ డ్రైవర్ డేవిడ్ లాంగ్ దే... రెండు సార్లు దక్కిన యూరో లాటరీ!


అదృష్టలక్ష్మి వరిస్తుందని లాటరీ టికెట్ కొనడం, ఆ తర్వాత డీలా పడటం చాలా మందికి అలవాటే. ఇంగ్లండ్ లో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్న డేవిడ్ లాంగ్ కూడా అందుకేమీ భిన్నం కాదు. లాటరీ టికెట్లు కొనడం, వాటిని చెత్తకుండీల్లో పడేయటం అతడికి మామూలే. అయితే ఓ సారి భార్య క్యాథలీన్ తో కలిసి పడేసిన లాటరీ టికెట్ ను చెత్తకుండీ వద్దకెళ్లి మరీ వెతుక్కుని చూస్తే, అతడి పంట పండింది. తన టికెట్ కు యూరో లాటరీలో రూ.10 కోట్లు వచ్చాయి. 2013లో ఈ ఘటన జరిగితే, తన పాత అలవాటుకు ఏమాత్రం చెల్లుచీటి ఇవ్వని లాంగ్ ఆ తర్వాత కూడా లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నాడు. తాజాగా గత శుక్రవారం లాంగ్ దంపతులకు మరోమారు యూరో లాటరీ తగిలింది. ఈ సారి కూడా రూ.10 కోట్ల విలువ చేసే లాటరీ వారి సొంతమైంది. సుదీర్ఘకాలంగా డ్రైవర్ గా పనిచేసి ఇటీవలే రిటైర్ అయిన లాంగ్, తనకు దక్కిన లాటరీ సొమ్ముతో ఓ విలాసవంతమైన ఇల్లు కొనుక్కుని, అందులో దర్జాగా బతకాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.

  • Loading...

More Telugu News