: ఓ ఇంటివాడవుతున్న సురేశ్ రైనా... చిన్ననాటి స్నేహితురాలితో రేపు వివాహం


భారత డ్యాషింగ్ బ్యాట్స్ మన్ సురేశ్ రైనా ఓ ఇంటివాడవుతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు ప్రియా చౌదరిని అతడు పెళ్లాడనున్నాడు. రేపు న్యూ ఢిల్లీలో జరగనున్న ఈ వివాహ వేడుకను అంగరంగవైభవంగా నిర్వహించేందుకు అతడి కుటుంబం సన్నాహాలు పూర్తి చేసింది. రైనా పెళ్లికి టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు జట్టు సభ్యులు, బీసీసీఐ ప్రముఖులు, పలువురు రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నట్లు సమాచారం. మొన్నటిదాకా పేలవ ప్రదర్శనతో కొట్టుమిట్టాడిన రైనా, వరల్డ్ కప్ లో తిరిగి ఫామ్ లోకొచ్చి దుమ్ము రేపిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News