: గౌతమిని కాల్చి చంపిన హంతకుడు వాళ్లక్క ఇంట్లో దొరికాడు!


బెంగళూరులో ఈ ఉదయం ప్రగతి కళాశాల పీయూసీ విద్యార్థిని గౌతమిని కాల్చి చంపిన కళాశాల అటెండర్ మహేష్ పోలీసులకు పట్టుబడ్డాడు. ప్రగతి రెసిడెన్షియల్ కళాశాలలో చదువుతున్న గౌతమిని అదే కళాశాలలో అటెండర్ గా పని చేస్తున్న మహేష్ ప్రేమిస్తున్నానంటూ వేధించేవాడు. ప్రేమను తిరస్కరించడంతో తట్టుకోలేకపోయిన మహేష్ తుపాకీతో విచక్షణా రహితంగా ఆమెపై కాల్పులకు దిగి హత్య చేశాడు. ఈ కాల్పుల్లో ఆమె స్నేహితురాలు శిరీష కూడా గాయపడిన సంగతి తెలిసిందే. కాగా, వారిని కాల్చి పరారైన మహేష్ నేరుగా తన సోదరి ఇంటికి చేరాడు. బి.నారాయణపురంలోని తన సోదరి ఇంట్లో దాక్కున్న మహేష్ ను గమనించిన ఆ ఇంటి ఓనర్, టీవీలో వార్తలు చూసి షాక్ తిన్నాడు. స్థానికులతో కలిసి హంతకుడిని పోలీసులకు పట్టించాడు. అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, మహేష్ దగ్గరకు రివాల్వర్ ఎలా వచ్చింది? అనే దానిపై ఆరా తీస్తున్నారు. నిందితుడు మహేష్ కర్ణాటక వాసి కాగా, మృతురాలు గౌతమి ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా పావుగడకు చెందిన వ్యక్తి.

  • Loading...

More Telugu News