: కమల్ రాజీనామాను ఆమోదించిన ఐసీసీ


ఐసీసీ అధ్యక్ష పదవికి ముస్తఫా కమల్ ఈ ఉదయం చేసిన రాజీనామాను ఐసీసీ ఆమోదించింది. ముస్తఫా కమల్ ప్రపంచకప్ టోర్నీలో అంపైర్ల తప్పుడు నిర్ణయాల వల్లే బంగ్లాదేశ్ ఓటమిపాలైందని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో, ఐసీసీ ఆయనను తప్పు పట్టింది. ఐసీసీ నిర్వహిస్తున్న టోర్నీలో ఐసీసీ నియమించిన అంపైర్లు తప్పు చేస్తే, థర్డ్ అంపైర్ నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పించామని, అందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం కూడా సమకూర్చామని ఐసీసీ ఆయనకు తెలిపి, ప్రపంచకప్ ముగింపు వేడుకకు దూరంగా ఉంచింది. దీనిపై మనస్తాపం చెందిన ఆయన ఈ ఉదయం ఐసీసీకి రాజీనామా లేఖ పంపారు. దానిని ఆమోదిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.

  • Loading...

More Telugu News