: కన్నడ హీరోను కొట్టి, గుండు గీశారు!
కన్నడ సినీ రంగాన్ని కుదిపేసిన సంఘటన బళ్లారిలో చోటుచేసుకుంది. శాండల్ వుడ్ హీరో అర్జున్ తన తాజా సినిమాలో కొత్త నటీనటుల కోసం అతను బళ్ళారి వెళ్లాడు. ఆడిషన్స్ లో రోష్ని అనే యువతి తనకు హీరోయిన్ గా అవకాశం ఇవ్వాలని కోరింది. ఆమె నటనా రంగానికి కొత్త కావడంతో అర్జున్ ఆమెను తిరస్కరించాడు. దీంతో, రోష్ని బావ అమిత్ తన అనుచరులు దాదాపు 20 మందితో వచ్చి అర్జున్ ను ప్రేమ్ నగర్ ప్రాంతంలోని ఓ ఇంటికి తీసుకెళ్లి, అక్కడ అతనిపై దాడికి దిగి, గుండుగీశారు. దీంతో అర్జున్ పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య పూజ, మరోనటుడిపై కూడా వారు దాడి చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.