: అతనికి 53 ఏళ్లు... 40 మంది పిల్లలు!
పిల్లల్ని కనడమే పనిగా పెట్టుకున్నాడో ప్రబుద్ధుడు. మాన్ మౌత్ ఫైర్ లో నివసిస్తున్న మైక్ హాల్పిన్ (53) ఓ చిరుద్యోగి. ప్రియురాలితో ఇద్దరు పిల్లల్ని కన్నాడు. తరువాత మరో ప్రియురాలితో మరో ఇద్దరు పిల్లల్ని కన్నాడు. వారి పోషణకు ఆదాయం సరిపోకపోవడంతో బ్రిటన్ ప్రభుత్వమే భత్యం చెల్లించడం మొదలుపెట్టింది. దీంతో, పనిచేయడం మానేసి 20 మంది ప్రియురాళ్లతో 40 మంది పిల్లల్ని కన్నాడు. వీరి పోషణార్థం బ్రిటన్ గవర్నమెంట్ ఏడాదికి 25 లక్షల రూపాయలు చెల్లిస్తోందట. 26 మంది పిల్లల్ని సామాజిక సేవా సంస్థలు దత్తత తీసుకుని పోషిస్తున్నాయట. తన 40 మంది పిల్లల్లో చాలా మంది పేర్లు అతనికి గుర్తులేవట. ఎవరైనా తన ముందుగా వెళుతున్నప్పుడు వారిమీద డౌటొస్తే వారి వీపు చూస్తాడట. వారి వీపుమీద తన వంశవృక్షం పచ్చబొట్టు పొడిపించాడట. ప్రస్తుతం ఇతను ప్రభుత్వ హాస్టల్లో డయానా మోరిస్ అనే మహిళతో కలిసి ఉంటున్నాడట. ప్రియురాళ్లతో సెక్స్ లో పాల్గొనడం, పిల్లల్ని కనడం ఆపనని బైబిల్ సూక్తులను కూడా గుర్తుచేస్తున్నాడు.