: ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో పాలస్తీనాకు సభ్యత్వం
ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ఐసీసీ)లో పాలస్తీనాకు సభ్యత్వం లభించింది. ఐసీసీలో ఇప్పటివరకు 122 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. కోర్టు హెడ్ క్వార్టర్స్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాలస్తీనాను సభ్యదేశంగా ఆహ్వానించారు. కోర్టు వ్యవస్థాపక ఒప్పందంపై పాలస్తీనా జనవరిలో సంతకం చేసింది. దీంతో, పాలస్తీనా ఐసీసీలో అధికారికంగా సభ్యత్వం పొందింది. ఇకపై పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణకు జవాబుదారీతనం తీసుకురావడానికి సభ్యత్వం ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఒప్పందం కారణంగా ఐసీసీలో ఇజ్రాయెల్ కి సభ్యత్వం లేకపోయినప్పటికీ ఆ దేశానికి చెందిన మిలటరీ, పౌర అధికారులు పాలస్తీనా భూభాగం మీద నేరాలు చేశారని భావిస్తే వారిపై ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.