: మాజీ మంత్రి నెట్టెం రఘురాంపై హత్యాయత్నం కేసు కొట్టివేత
మాజీ మంత్రి నెట్టెం రఘురాంపై ఉన్న హత్యాయత్నం కేసును కృష్ణాజిల్లాలోని నందిగామ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు కొట్టివేసింది. ఆయనతో పాటు మరో 119 మందిపై కూడా కేసును కొట్టివేసింది. 2006లో వత్సవాయిలో మారెళ్ల పుల్లారెడ్డిపై హత్యకు యత్నించినట్టు రఘురాం సహా వారందరిపై కేసు నమోదైంది. దాదాపు 9 ఏళ్ల పాటు సాగిన విచారణ తరువాత కేసును కొట్టివేయడం విశేషం.