: అంత సీక్రెట్ ఎందుకని చంద్రబాబును అడుగుతున్నా: సీపీఐ నారాయణ


ప్రత్యేకహోదాపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏ మేరకు పోరాటం చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడంలేదని సీపీఐ జాతీయ నేత నారాయణ తెలిపారు. దానిని అంత రహస్యంగా చేయడం ఎందుకు? అని చంద్రబాబును అడుగుతున్నానని అన్నారు. ప్రత్యేకహోదాపై జరిగిన చర్చావేదికలో ఆయన మాట్లాడుతూ, "టీడీపీ నేతలు మాత్రమే బీజేపీ జాతీయ నేతలను కలుస్తారు, అనంతరం బయటికి వచ్చి ప్రత్యేకహోదా వచ్చేస్తుందని చెబుతారు. తరువాత బీజేపీ నేతలు బయటికి వచ్చి బిల్లులో ప్రత్యేకహోదా ప్రస్తావనే లేదని చెబుతారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఇచ్చే అవకాశం లేదని మరి కొంతమంది చెబుతారు". ఈ నేపథ్యంలో, వాస్తవం ఏంటో అర్థం కాక ప్రజలంతా గందరగోళానికి లోనవుతున్నారని ఆయన చెప్పారు. అలా కాకుండా రాష్ట్రంలోని రాజకీయపార్టీల నేతలంతా కేంద్రం వద్దకు ప్రత్యేకహోదా కోసం వెళ్దామని ఆయన సూచించారు. అప్పుడు కేంద్రం ఏం చెబుతుందో, అందులో వాస్తవం ఎంతో ప్రజలు తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. నేతల వ్యాఖ్యల కారణంగా రాజకీయనాయకులను నమ్మే పరిస్థితి లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News