: కేసీఆర్ పన్ను నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే ఉద్యమిస్తాం: నన్నపనేని


రవాణా పన్ను విధించడం పట్ల తెలంగాణ సర్కారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు రవాణా పన్ను నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని టీడీపీ మహిళా నేత నన్నపనేని రాజకుమారి డిమాండ్ చేశారు. గుంటూరులో ఆమె మాట్లాడుతూ, కేసీఆర్ తీరు మార్చుకోవాలని హితవు పలికారు. ఈ విషయంలో ఆమరణ దీక్షకు కూడా సిద్ధమేనని స్పష్టం చేశారు. అటు, ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు కూడా తెలంగాణ సర్కారు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ విషయంలో ట్రావెల్స్ యజమానులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News