: ప్రైవేటు ట్రావెల్స్ పిటిషన్ పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వు
తెలంగాణ ప్రభుత్వం విధించిన రవాణా పన్నుపై ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ చెక్ పోస్టుల వద్ద హామీ పత్రాలు ఇవ్వాలని పిటిషనర్లకు సూచించింది. పిటిషన్ దాఖలు చేసిన వారికే వర్తించేలా కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 7కు వాయిదా వేసింది. పిటిషన్ పై వాదనల సమయంలో, రవాణా పన్ను వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తమ విజ్ఞప్తిని తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదని ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు కోర్టుకు తెలిపారు. దాంతో, ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయని తెలిపారు. ఈ క్రమంలో జీవో నంబరు 15ను రద్దు చేయాలని కోర్టును కోరారు.