: ముగిసిన ఏపీ మంత్రివర్గ సమావేశం... 'అమరావతి' పేరుకు ఆమోదం


ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఉదయం 10.30 సమయంలో మొదలైన ఈ భేటీ దాదాపు నాలుగు గంటలకు పైగా జరిగింది. సచివాలయంలో జరిగిన ఈ సుదీర్ఘ సమావేశంలో, నవ్యాంధ్ర రాజధానికి ఖరారు చేసిన అమరావతి పేరుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నూతన పారిశ్రామిక విధానానికి కూడా ఆమోదం తెలిపింది. ఇక నిన్న (మంగళవారం) రాష్ట్రానికి కేంద్రం విడుదల చేసిన ఆర్థిక సాయానికి మంత్రివర్గం కృతజ్ఞతలు తెలిపింది. మిగతా రాష్ట్రాలతో పోటీపడే స్థాయి వచ్చేంతవరకూ రాష్ట్రానికి సహకరించాలని సమావేశంలో మంత్రివర్గం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అంతేగాక కేంద్రంతో నిరంతర సంప్రదింపులు కొనసాగించాలని నిర్ణయించింది. మంత్రివర్గ సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ సాయంత్రం 7 గంటలకు నిర్వహించే సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వెల్లడించనున్నారు.

  • Loading...

More Telugu News