: ప్రముఖ కవి, సీనియర్ పాత్రికేయుడు శశిశ్రీ కన్నుమూత
ప్రముఖ కవి, సీనియర్ పాత్రికేయుడు శశిశ్రీ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణవార్తను సాహితీప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు. పలువురు కవులు శశిశ్రీ మరణంపట్ల సంతాపం ప్రకటించారు. యోగి వేమన విశ్వవిద్యాలయంలో పాలక మండలి సభ్యుడిగా, దూరదర్శన్ విలేకరిగా పనిచేశారు. కడప పట్టణానికి చెందిన ఆయన ఇప్పటివరకు 20 పుస్తకాలు రాశారు. రాయలసీమ సాహిత్యం, చూపు, రాతి పూలు, దహేజ్, సీపీ.బ్రౌన్ చరిత్ర తదితర పుస్తకాలు రాశారు. ఈయన ప్రతిభ, సేవలకు గుర్తింపుగా యునిసెఫ్ అవార్డు లభించింది.