: వచ్చే జన్మలో సల్మాన్ ఖాన్ లా పుట్టాలనుకుంటున్నా: సన్నీ లియోన్
వచ్చే జన్మలో నటుడు సల్మాన్ ఖాన్ లా పుట్టాలని కోరుకుంటున్నట్టు శృంగారతార, బాలీవుడ్ నటి సన్నీ లియోన్ కోరుకుంటోంది. ప్రస్తుతం హిందీలో ఆమె నటించిన 'ఏక్ పహేలీ లీలా' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో, ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమ్మడు పైవిధంగా మాట్లాడింది. మీ రాబోయే చిత్రం పునర్జన్మ ఆధారంగా రూపొందినందున, మళ్లీ మరొకరిలా పుట్టాలనుకుంటే, ఎవరిలా ఉండాలనుకుంటున్నారు? అని సన్నీని ప్రశ్నించారు. ఇందుకు ఆమె సమాధానమిస్తూ "సల్మాన్ ఖాన్ లా తిరిగి రావాలనుకుంటున్నా. ఇండియాలోని పెద్ద స్టార్లలో ఆయనొకరు. ప్రజలు ఆయనంటే భయపడుతున్నారు. కానీ అదే సమయంలో వాళ్లు సల్మాన్ ను ప్రేమిస్తారు కూడా. తను చాలా చాలా స్వచ్ఛంద సేవ చేస్తున్నారు. చాలా మంచి మనిషి" అని చెప్పుకొచ్చింది.