: భద్రాచలం శ్రీరాముడిని దర్శించుకున్న మంత్రులు గడ్కరీ, దత్తాత్రేయ
తెలంగాణ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఖమ్మం జిల్లాలోని భద్రాచలం శ్రీరాముల వారిని , దర్శించుకున్నారు. ఆయనతో పాటు మంత్రి బండారు దత్తాత్రేయ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన వారు, స్వామివారికి కానుకలు సమర్పించుకున్నారు. తరువాత భద్రాచలం వంతెన నిర్మాణ పనులకు గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా పాల్గొన్నారు. అక్కడి నుంచి జిల్లాలోని నెనుబల్లిలో 44 కి.మీ జాతీయ రహదారికి గడ్కరీ శంకుస్థాపన చేయనున్నారు.