: ఎండలో ధర్నా చేస్తే గ్లామర్ పోతుంది... నర్సులపై గోవా సీఎం వివాదాస్పద వ్యాఖ్య


వైద్య శాఖలో అవినీతిపై ఉక్కుపాదం మోపి, సర్కారు సొమ్ము దుర్వినియోగాన్ని అరికట్టాలని డిమాండ్ చేసిన నర్సులపై గోవా సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎండలో సమ్మె చేస్తే గ్లామర్ పోతుంది. నల్లగా అయిపోతారు. ఆ తర్వాత పెళ్లికొడుకు దొరకడం కష్టం’’ అంటూ పర్సేకర్ చేసిన వ్యాఖ్యలపై అటు నర్సులతో పాటు ఇటు కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.., రాష్ట్రంలో 108 సేవల నిర్వహణ కాంట్రాక్టును ఓ ప్రైవేట్ సంస్థకు అప్పజెప్పడాన్ని నిరసిస్తూ నర్సులు కొంతకాలంగా ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలో 33 అంబులెన్స్ ల స్థానంలో 13 వాహనాలనే తిప్పుతూ సర్కారు ధనాన్ని దోచేస్తున్న సదరు ప్రైవేట్ సంస్థపై సీఎంను కలిసి ఫిర్యాదు చేసేందుకు నర్సులు సెక్రటేరియట్ కు వెళ్లారు. ఈ సందర్భంగా పర్సేకర్ నర్సుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే పర్సేకర్ అలాంటి వ్యాఖ్యలు చేయలేదని సీఎం కార్యాలయ వర్గాలు కొట్టిపారేశాయి.

  • Loading...

More Telugu News