: అంతర్ రాష్ట్ర పన్ను అనేది తెలంగాణ పరిధిలోనిది: మంత్రి గడ్కరీ
తెలంగాణ అంతర్ రాష్ట్ర పన్ను విధానంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ఆ రాష్ట్రంలో ప్రవేశించే ఏపీ వాహనాలపై పన్ను విధించడం అనేది తెలంగాణ పరిధిలోనిదని చెప్పారు. గడ్కరీతో ఈ ఉదయం టీ.రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి సమావేశమై ఆర్టీసీ విభజనపై చర్చించారు. అనంతరం వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు డ్రై పోర్టు కోసం కేంద్రం కృషి చేస్తుందని గడ్కరీ అన్నారు. భారత్ లో జల రవాణా మెరుగుపడటానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. కాగా నిబంధనల ప్రకారమే ఏపీ వాహనాలపై రహదారి పన్ను విధిస్తున్నామని మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. ఏపీ అధికారుల వల్లే ఇప్పటివరకు ఆలస్యమైందని, రాష్ట్రం విభజన జరిగింది కాబట్టే పన్ను విధిస్తున్నామన్నారు.