: రైల్వే ఫ్లాట్ ఫాం టికెట్ ధర రూ.10... నేటి నుంచే అమల్లోకి!


ఇకపై ఫ్రెండ్ కు వీడ్కోలు పలికేందుకు రైల్వే స్టేషన్ కు వెళ్లాలంటే జేబులో రూ.10 నోటు వేసుకుని వెళ్లాల్సిందే. నిన్నటిదాకా రూ.5 గా ఉన్న ఫ్లాట్ ఫాం టికెట్ ధర రూ.10కి పెరిగింది. ఈ మేరకు మొన్నటి బడ్జెట్ లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు పెంచిన ఫ్లాట్ ఫాం టికెట్ ధర నేటి నుంచి అమలు కానుంది. ఫ్లాట్ ఫాం టికెట్ ధర రూ.5 గా ఉన్నప్పుడే ఏటా రూ.7.5 కోట్ల మేర ఆదాయాన్ని ఆర్జించిన దక్షిణ మధ్య రైల్వే, ఇకపై ఫ్లాట్ ఫాం టికెట్ల విక్రయాలపై రెట్టింపు ఆదాయాన్ని రాబట్టనుంది. ఇదిలా ఉంటే, 120 రోజుల ముందుగానే రైల్వే టికెట్ రిజర్వేషన్ చేయించుకునే సౌకర్యం కూడా నేటి నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.

  • Loading...

More Telugu News