: ఊహాగానాలకూ ఓ హద్దుండాలి... ఆస్ట్రేలియా టూర్ సెటైర్లపై అనుష్క శర్మ
‘‘ఊహాగానాలకు ఓ హద్దంటూ ఉండాలి. అయినా నా బ్యాక్ పెయిన్ కు, ఆస్ట్రేలియా టూర్ కు ఏమిటీ సంబంధం? ఎన్ హెచ్ 10 సినిమా షూటింగ్ సందర్భంగా బ్యాక్ పెయిన్ మొదలైంది. తీరిక లేక చూపించుకోలేదు. ఇప్పుడు ఆ పెయిన్ మరింత పెరిగిపోవడంతో ఆస్పత్రికి వెళ్లాను. దీనిపై ఊహాగానాలు అల్లడం బాధిస్తోంది’’ అంటూ బాలీవుడ్ బ్యూటీ, టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ గర్ల్ ఫ్రెండ్ అనుష్క శర్మ ఆవేదన వ్యక్తం చేసింది. విరాట్ ఆటను చూసేందుకు ఆస్ట్రేలియా వెళ్లడంతోనే తనకు బ్యాక్ పెయిన్ వచ్చిందన్న వదంతులపై ఆమె విస్మయం వ్యక్తం చేసింది. ‘‘కోహ్లీతో బంధాన్ని నేనేం దాయలేదుగా, కోహ్లీతో కలిసి బయటకు వచ్చినప్పుడు ఫొటోలు తీస్తున్నా, ఏమీ అనడం లేదు. అయినా మా బంధంపై లేనిపోని రాద్ధాంతం చేయడం భావ్యం కాదు’’ అని ఆమె వాపోయింది.