: మద్యం సేవించిన డ్రైవర్ సూసైడ్ బాంబర్ తో సమానం: ఢిల్లీ కోర్టు
ఢిల్లీలోని ఓ స్థానిక న్యాయస్థానం మద్యపానం చేసి వాహనాలు నడిపే డ్రైవర్ల వ్యవహారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మద్యపానం చేసి వాహనాలు నడిపే డ్రైవర్లను సూసైడ్ బాంబర్లతో పోల్చింది. సూసైడ్ బాంబర్లు తమను తాము పేల్చేసుకుని తమ చుట్టూ ఉన్నవారి మరణానికి కారణమవుతారని, తాగి నడిపే డ్రైవర్లు కూడా ప్రమాదాల బారిన పడి తాము చనిపోవడమే గాకుండా, ఇతరుల మరణానికి కారణమవుతారని పేర్కొంది. అధిక మోతాదులో మద్యపానం కారణంగా కంటిచూపు సరిగా ఉండదని, తద్వారా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువని తెలిపింది. ఓ ఆటో డ్రైవర్ కేసులో అదనపు సెషన్స్ జడ్జ్ వీరేందర్ భట్ ఈ వ్యాఖ్యలు చేశారు.