: ప్రత్యేక హోదాకు ప్రయత్నిస్తాం... అనుకున్న నిధులు వచ్చాయి: సుజనా చౌదరి


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాకోసం ప్రయత్నిస్తామని కేంద్ర మంత్రి సుజనా చౌదరి తెలిపారు. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక హోదాపై కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు తాము ఊహించిన విధంగా కేంద్రం నిధులు విడుదల చేసిందని ఆయన చెప్పారు. పన్నుల లోటు భర్తీ చేసేందుకు రూ.2,300 కోట్లు, రాజధాని నిర్మాణానికి సంబంధించి రూ.1500 కోట్లు కేంద్రం విడుదల చేసిందని ఆయన వెల్లడించారు. మరిన్ని నిధులు విడుదల చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ప్రతి హామీని కేంద్రం నెరవేరుస్తుందని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News