: ఏపీకి విడతల వారీగా నిధులు సుజనాతో జైట్లీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం విడతల వారీగా నిధులు అందజేస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఢిల్లీలో జైట్లీతో సుజనాచౌదరి భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ, పునర్విభజన చట్టంలోని హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని అన్నారు. ఇప్పటికే కొన్ని నిధులు విడుదల చేశామని ఆయన చెప్పారు. ఏపీతో పాటు తెలంగాణకు కూడా విభజన చట్టం ప్రకారం సాయం అందజేస్తామని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయిస్తామని ఆయన పేర్కొన్నారు. ఫైనాన్స్ కమిషన్ చెప్పినట్టు ఐదేళ్ల పాటు సాయం కొనసాగిస్తామని జైట్లీ తెలిపారు.