: తెలంగాణలో కలెక్టర్లకు కొత్త వాహన యోగం
తెలంగాణలోని అన్ని ప్రభుత్వ వ్యవస్థలకు కొత్త రూపు తెచ్చేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కృతనిశ్చయంతో ఉన్నారు. ఇప్పటికే పోలీసులకు ఇన్నోవా వాహనాలు సమకూర్చిన సర్కారు, ఇతర అధికారులకు కూడా సరికొత్త వాహనాలు అందిస్తోంది. ఈ క్రమంలో, తెలంగాణ జిల్లాల్లో పనిచేస్తున్న కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకు టయోటా ఫార్చ్యూనర్ వాహనాలు అందించాలని నిర్ణయించింది. అందుకోసం రూ.5.25 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.