: గ్రహణం ఎప్పుడొస్తుందో చెప్పొచ్చు... కానీ, రాహుల్ రాకను చెప్పలేం: జవదేకర్


కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేవకర్ సెటైర్లు విసిరారు. రాహుల్ అంతుచిక్కని సెలవు వ్యవహారంపై వ్యంగ్యంగా స్పందిస్తూ, "సూర్య గ్రహణాన్ని గానీ, చంద్ర గ్రహణాన్ని గానీ ముందుగానే అంచనా వేసేందుకు కొన్ని లెక్కలున్నాయి. కానీ, రాహుల్ గాంధీ ఎప్పుడొస్తాడో చెప్పే లెక్కలు మాత్రం లేవు. అంతకుమించి ఇంకేం చెప్పగలం?" అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ యువరాజు ఏప్రిల్ 19న జరిగే కిసాన్ ర్యాలీకి హాజరవుతారన్న వార్తలపై స్పందించాలని ఓ మీడియా ప్రతినిధి కోరిన మీదట జవదేకర్ పైవిధంగా పేర్కొన్నారు. అటు, రాహుల్ రాకపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ శ్లేషార్థాలతో మాట్లాడుతూ మీడియా ప్రతినిధులను తికమకపెట్టే ప్రయత్నం చేశారు. కిసాన్ ర్యాలీకి రాహుల్ వస్తాడా? అన్న ప్రశ్నకు జవాబిస్తూ... "ర్యాలీకి పార్టీ సీనియర్లందరూ హాజరవుతారు. రాహుల్ సీనియర్ కాదా ఏమిటి? రాహుల్ కూడా సీనియర్ నాయకుడే" అని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News