: తెలంగాణ మావోయిస్టు కొత్త కార్యదర్శిగా హరిభూషణ్ ఎన్నిక
రాష్ట్ర విభజన జరిగిన అనంతరం తెలంగాణలో మావోయిస్టుల కదలికలు పెరుగుతున్నాయనే వార్తలు అడపాదడపా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ మావోయిస్టు కొత్త కార్యదర్శిగా హరిభూషణ్ ఎన్నికయ్యారు. తెలంగాణలో మావోయిస్టులపై నిషేధం కొనసాగుతున్నప్పటికీ, మావోలు ప్లీనరీ నిర్వహించారు. ఈ ప్లీనరీకి భారీ సంఖ్యలో దాదాపు 400 మంది మావోయిస్టులు హాజరయినట్టు సమాచారం. ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో ఈ ప్లీనరీని నిర్వహించారు. సమాచారం అందుకున్న గ్రేహౌండ్స్ బలగాలు మావోలను పట్టుకునేందుకు భారీ కూంబింగ్ చేపట్టాయి.