: పట్టిసీమను అడ్డుకోవడం సరికాదు: మండలి బుద్ధప్రసాద్
రాయలసీమ రైతాంగాన్ని ఆదుకునేందుకు ఉద్దేశించిన పట్టిసీమ ప్రాజెక్టును అడ్డుకోవడం సరికాదని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ హితవు పలికారు. ఈ ప్రాజెక్టును ప్రతి ఒక్కరూ సానుకూల ధోరణితో చూడాలని అన్నారు. ఈ ప్రాజెక్టుతో రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని తెలిపారు. రైతులకు ఉపయోగపడే ఇలాంటి ప్రాజెక్టులను కొందరు అడ్డుకోవాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు. గోదావరి నదిపై పశ్చిమగోదావరి జిల్లా పట్టిసీమ వద్ద భారీ ఎత్తిపోతల పథకానికి ఏపీ సర్కారు కసరత్తులు చేస్తున్న సంగతి తెలిసిందే.