: మా భార్యల నుంచి రక్షించండి బాబోయ్: గుజరాత్ లో భర్తల ఆక్రందన


గృహహింస, ఈవ్ టీజింగ్ నుంచి మహిళలకు రక్షణ కల్పించేందుకు గుజరాత్ ప్రభుత్వం 'అభయ' అనే హెల్ప్ లైన్ ను ప్రారంభించింది. దీనికి 181 అనే నెంబర్ ను కూడా కేటాయించింది. అయితే, ఇప్పుడా నెంబర్ కు మహిళలే కాదు పురుషులు కూడా రక్షించాలని ఫోన్లు చేస్తున్నారట. తమ ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోకుండా, ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, గృహహింసకు పాల్పడుతున్నారని గుజరాత్ పురుషులు హెల్ప్ లైన్ కు భార్యలపై ఫిర్యాదులు చేస్తున్నారట. భార్యలు తమ తల్లిదండ్రులతో సరిగా మెలగడం లేదని, దీనికి తోడు అత్తల పోరు ఎక్కువైందని వారు వాపోతున్నారట. గత ఆరు నెలలుగా 28 శాతం మంది పురుషులు హెల్ప్ లైన్ కు ఫిర్యాదు చేశారని అధికారులు తెలిపారు. తమ భార్యల్లో మార్పు తీసుకురావాలని వారు కోరారట. 181 నెంబర్ కు గత సెప్టెంబర్ నుంచి ఈ ఫిబ్రవరి వరకు వచ్చిన 7,919 ఫోన్ కాల్స్ లో మహిళలు చేసినవి 5,718 కాగా, పురుషులు చేసినవి 2,201. అంటే, సుమారు 28 శాతం ఫోన్ కాల్స్ పురుషుల నుంచి వచ్చినవే కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

  • Loading...

More Telugu News