: కోహ్లీ గుండె దేశం కోసమే కొట్టుకుంటుంది: రవిశాస్త్రి
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై విమర్శలు రావడాన్ని జట్టు డైరక్టర్ రవిశాస్త్రి భరించలేకపోతున్నట్టుంది. జట్టు ఓటమికి కోహ్లీని బాధ్యుడిని చేయడం సరికాదని అన్నారు. కోహ్లీ చిత్తశుద్ధిని శంకించలేమని, అతడి గుండె దేశం కోసమే కొట్టుకుంటుందని పేర్కొన్నారు. ఆసీస్ పర్యటనలో కోహ్లీ బాగానే ఆడాడని, భారీ సంఖ్యలో పరుగులు చేశాడని కితాబిచ్చారు. అనుష్క శర్మే కోహ్లీ వైఫల్యానికి కారణమనుకుంటే, ఆసీస్ గడ్డపై అన్ని పరుగులు చేసుండేవాడు కాడని అన్నారు. ఇంగ్లండ్ టూర్ తర్వాత కోహ్లీ ఆటతీరు గణనీయంగా మెరుగైందని తెలిపారు.