: పర్వతారోహకుడు మస్తాన్ బాబు కోసం చిలీలో గాలింపు ముమ్మరం
నెల్లూరు జిల్లా గాంధీ జన సంఘం గ్రామానికి చెందిన ప్రఖ్యాత పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు చిలీలో కనిపించకుండా పోవడం తెలిసిందే. కొన్ని రోజులుగా ఆయన ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మస్తాన్ బాబు కోసం చిలీ పర్వతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పర్వతారోహణలో మస్తాన్ బాబు గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించాడు. చిలీ పర్వతాల్లోనూ సాహసయాత్ర కొనసాగిస్తుండగా, ఆయనతో సంబంధాలు తెగిపోయాయి. మస్తాన్ బాబు సోదరి దొరసానమ్మ హైదరాబాదు చేరుకుని తన సోదరుడి ఆచూకీ కోసం అధికారులను కలిశారు. చిలీలోని భారత హై కమిషన్ అక్కడి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసినట్టు తెలిసిందని మస్తాన్ బాబు కజిన్ శ్రీను చెప్పారు. చిలీ పర్వత సానువుల్లో హెలికాప్టర్లతో గాలిస్తున్నట్టు పేర్కొన్నారు.