: రైల్వే టికెట్ రిజర్వేషన్ గడువు పెంపు రేపటి నుంచే
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. రైళ్లలో ముందస్తు రిజర్వేషన్ల గడవు పెంపు రేపటి నుంచే అమలు చేస్తున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. ఇప్పటిదాకా 60 రోజుల ముందుగా టికెట్ రిజర్వేషన్ చేసుకునే వీలుండేది. ఇక నుంచి నాలుగు నెలల ముందుగా (అంటే 120 రోజులు) చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు.