: పీవీకి ఢిల్లీలో మెమోరియల్ ఘాట్.... ప్లాన్ చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం


మాజీ ప్రధాని పీివి నరసింహారావు చనిపోయినప్పుడు నాటి కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసినప్పటికీ... ఆయన కీర్తిని తిరిగి పునరుద్ధరించాలని ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఢిల్లీలో ఓ స్మృతి చిహ్నం ఏర్పాటుచేసి దేశ ఆర్థిక సంస్కరణలకు నాంది పలికిన పీవీని సముచితంగా గౌరవించాలనుకుంటోంది. ఈ క్రమంలో ఏక్తా స్థల్ సమాధి కాంప్లెక్స్ లో పీవీకి స్మారక ఘాట్ నిర్మించేందుకు అనుమతి కోసం గతవారం కేంద్ర పట్టణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ కేబినెట్ కు ఓ ప్రతిపాదన పంపిందని సమాచారం. పీవీ స్మారక ఘాట్ పాలరాతితో ఉంటుందంటున్నారు. తెలంగాణకు చెందిన పీవీకి స్మారక చిహ్నంగా ఘాట్ నిర్మించాలని కోరుతూ గతేడాది అక్టోబర్ లో తెలుగుదేశం ఓ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. కాగా, టీడీపీ డిమాండ్, ఒత్తిడితోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడంతో అటు కాంగ్రెస్ కు తీవ్ర అవమానభారం మిగలనుంది. ఇటు, బీజేపీకి మంచి పేరు దక్కనుంది.

  • Loading...

More Telugu News