: ఏపీ నుంచి హైదరాబాదుకి ప్రైవేటు బస్సులు రావు... టి.సర్కారు పన్ను ఫలితం!


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాదు రావాల్సిన 80 శాతం ప్రైవేటు బస్సులు నిలిచిపోనున్నాయి. నేటి అర్ధరాత్రి నుంచి అంతర్రాష్ట్ర పన్ను విధానం అమలు చేయాలని, ఏపీ నుంచి వచ్చే ప్రతి వాహనానికి పన్ను వసూలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో, నేటి అర్థరాత్రి నుంచి ఏపీ నుంచి వచ్చే బస్సులకు ప్రత్యేక పన్ను వసూలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో, ప్రైవేటు ట్రావెల్స్ యాజమానులు సమావేశమయ్యారు. సర్వీసులు నిలిపివేయాలని నిర్ణయించారు. దీంతో, ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన బస్సులు ఆగిపోనున్నాయి. ఈ మేరకు ప్రైవేటు బస్సుల రిజర్వేషన్లు కూడా ఆపేశారు. పన్ను కట్టాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ట్రావెల్స్ యాజమాన్యాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News