: ఆప్ లోక్ పాల్ కమిటీలో తెలుగు వ్యక్తి దిలీప్ కుమార్
ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ లోక్ పాల్ కమిటీ నుంచి అనూహ్యంగా అడ్మిరల్ ఎల్.రామ్ దాస్ కు ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముగ్గురు కొత్త సభ్యులను లోక్ పాల్ కమిటీలో నియమించారు. విశేషమేమిటంటే, కమిటీలో ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నానికి చెందిన దిలీప్ కుమార్ అనే వ్యక్తికి స్థానం లభించింది. అడ్మిరల్ రామ్ దాస్ స్థానంలో ఆయనను నియమించారు. ఆప్ లోక్ పాల్ లో తాను నియమితుడవడంపై దిలీప్ స్పందిస్తూ, ఇది తనకు చాలా ఆశ్చర్యం కలిగించిందన్నారు. తాను ఆప్ లో సభ్యుడిని కాదని, అయినప్పటికీ తన శక్తి మేరకు పారదర్శకంగా బాధ్యతలు నిర్వహిస్తానని చెప్పారు. మాజీ ఐపీఎస్ అధికారి అయిన దిలీప్... గతంలో ఢిల్లీ పోలీస్ యాంటీ కరప్షన్ చీఫ్ గా పని చేశారు. ఆ సమయంలో నిజాయతీగల అధికారిగా పేరు తెచ్చుకున్నారు. అంతేగాక లంచం తీసుకుంటున్న అధికారులపై స్టింగ్ ఆపరేషన్స్ నిర్వహించి మరింత పాప్యులర్ అయ్యారు.