: మంత్రులతో భేటీ కానున్న మోదీ... హడలెత్తిపోతున్న కేంద్ర సచివులు!


కేంద్ర కేబినెట్ విస్తరణ వార్తలు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నాయి. అదే సమయంలో పనితీరు సరిగా లేని మంత్రుల పదవులు ఊడటం ఖాయమన్న వార్తలూ జోరందుకున్నాయి. సరిగ్గా అదే సమయంలో కేంద్ర కేబినెట్ లోని స్వత్రంత్ర హోదా, సహాయ మంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అవుతారన్న వార్తలు ఒక్కసారిగా వేడిని రాజేశాయి. భేటీలో భాగంగా మంత్రుల పనితీరుపై మోదీ ప్రస్తావన చేయడంతో పాటు స్వీయ నివేదికలు కోరతారని కూడా ప్రచారం సాగుతోంది. మంత్రులిచ్చే స్వీయ నివేదికలను, తాను తయారుచేయించిన నివేదికలతో మోదీ సరిపోల్చి ఉద్వాసనకు నిర్ణయం తీసుకుంటారన్న ఊహాగానాలతో కేంద్ర మంత్రులు హడలిపోతున్నారు. మోదీతో భేటీకి గైర్హాజరు కాలేక, తమ పనితీరుపై నివేదికలు ఇవ్వలేక మంత్రులు తీవ్ర అంతర్మథనంలో పడ్డారు.

  • Loading...

More Telugu News