: ఈడీ ఆస్తుల జప్తుపై దర్శకుడు దాసరి స్పందన


బొగ్గు కుంభకోణం కేసులో కేంద్ర మాజీ సహాయ మంత్రి, దర్శకుడు దాసరి నారాయణరావు వాటాదారుగా ఉన్న సౌభాగ్య మీడియా లిమిటెడ్ కు చెందిన రూ.2 కోట్ల ఆస్తులను ఈడీ తాత్కాలికంగా జప్తు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అందులో సౌభాగ్య మీడియాకు చెందిన ఓ నివాస భవనం, రూ.50 లక్షల విలువైన డిపాజిట్ లు, ఖరీదైన రెండు కార్లు ఉన్నాయని పీటిఐ వార్తా కథనంలో తెలిపింది. దానిపై దాసరి స్పందిస్తూ, సౌభాగ్య మీడియాలో తాను వాటాదారు మాత్రమేనని చెప్పారు. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ లో సౌభాగ్య మీడియా లిమిటెడ్ లిస్టెడ్ కంపెనీ అని, ఆ కంపెనీ వాటాల ట్రేడింగ్ జరుగుతోందని తెలిపారు. అయితే ఈడీ ఆస్తుల జప్తుకు సంబంధించి తనకెలాంటి ఉత్తర్వులు అందలేదన్నారు. తన సొంత ఆస్తులు జప్తు చేస్తూ ఈడీ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని దాసరి స్పష్టం చేశారు. ఒకవేళ ఈడీ ఉత్తర్వులు ఇస్తే అవి తాను వాటాదారుగా ఉన్న సౌభాగ్య మీడియాకు చెందిన ఆస్తులేనని వివరించారు.

  • Loading...

More Telugu News