: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఎల్ కే అద్వానీకి నోటీసు
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీకి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. ఆయనతో పాటు మరో 8 మందికి కూడా నోటీసులు పంపింది. వారిలో బీజేపీ మరో అగ్రనేత మురళీ మనోహర్ జోషీ, కల్యాణ్ సింగ్, ఉమాభారతి ఉన్నారు. మసీదు కూల్చివేత వ్యవహారంపై నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. 1992 బాబ్రీ మసీదు కూల్చివేత కుట్ర కేసులో అద్వానీ సహా మిగతావారిపై ఉన్న కుట్ర ఆరోపణలను తొలగించిన అలహాబాద్ కోర్టు విముక్తి కల్పించింది. అయితే వారిపై మళ్లీ అభియోగాలను నమోదు చేయాలంటూ మోహబూబ్ అహ్మద్ అనే వ్యక్తి ఓ పిటిషన్ వేశాడు. దానిపై విచారించిన సుప్రీం పైవిధంగా స్పందించింది.