: కాశ్మీర్ వరదల్లో 17కు చేరిన మృతుల సంఖ్య... ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్న పరిస్థితి


దాదాపు ఏడు నెలల తరువాత కురుస్తున్న వర్షాలతో జమ్ము కాశ్మీర్ మళ్లీ తీవ్ర ఇబ్బందులెదుర్కొంటోంది. మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో కాశ్మీర్ వ్యాలీలోని కొన్ని ప్రాంతాలు, జమ్ముూలోని మరికొన్ని ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. వరదల్లో చిక్కుకుని మరణించిన వారి సంఖ్య 17కు చేరింది. సహాయక చర్యల్లో 8 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయి. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నిన్న (సోమవారం) రాత్రి నుంచి వర్షాలు కురవకపోవడంతో కాశ్మీర్ లో పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోంది.

  • Loading...

More Telugu News