: దుబాయిలోకి ప్రవేశించిన తాజ్ హోటల్స్... బుర్జ్ ఖలీఫా సమీపంలో లగ్జరీ హోటల్ ప్రారంభం
దేశీయంగానే కాక పలు ఇతర దేశాల్లో హోటళ్లను నిర్వహిస్తున్న తాజ్ గ్రూప్ దుబాయిలోకి ప్రవేశించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాకు అతి సమీపంలో ‘తాజ్ దుబాయి’ పేరిట కొత్త హోటల్ ను ప్రారంభించింది. నిన్న లాంఛనంగా ప్రారంభమైన ఈ హోటల్ లో 296 గదులు ఉన్నాయి. తాజ్ దుబాయితో తాజ్ గ్రూపులోని హోటళ్ల సంఖ్య 128కి చేరింది. ఇప్పటికే మాల్దీవులు, మలేషియా, బ్రిటన్, అమెరికా, భూటాన్, శ్రీలంక, ఆఫ్రికా, పశ్చిమాసియాలో తాజ్ గ్రూప్ హోటళ్లను కలిగి ఉంది.