: చిన్నారులను చిదిమేసిన గోడ... బోరబండలో విషాదం
హైదరాబాదులోని బోరబండలో నిన్న రాత్రి విషాదం చోటుచేసుకుంది. ఇంటి గోడ కూలిన ఘటనలో ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. వివరాల్లోకెళితే, జీహెచ్ఎంసీలో డైలీ వేజ్ కార్మికుడిగా పనిచేస్తున్న రాజు బోరబండలో అద్దె ఇంటిలో నివాసముంటున్నాడు. నిన్న రాత్రి భార్య, ఇద్దరు పిల్లలు సాయి చరణ్ (2), నవ్య (4)లతో కలిసి భోజనం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇంటిగోడ ఉన్నట్టుండి కూలిపోయింది. గోడ శిథిలాలు పిల్లలపై పడ్డాయి. దీంతో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే చనిపోయారు. ఈ ప్రమాదంలో రాజు, అతడి భార్యకు తీవ్ర గాయాలయ్యాయి.