: అనంతలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా... 20 మందికి గాయాలు, ఆరుగురి పరిస్థితి విషమం
మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. అనంతపురం జిల్లా కొత్తచెరువు మండలం కొడపగానిపల్లె వద్ద నేటి తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను కర్ణాటక వాసులుగా గుర్తించారు. కర్నూలు జిల్లాలోని మంత్రాలయం క్షేత్రాన్ని సందర్శించుకుని వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.