: ప్రధాని మోదీతో ‘అలీబాబా’ జాక్ మా భేటీ... చిన్న సంస్థలకు తోడ్పాటుపై చర్చ!


చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా.కామ్ చీఫ్ 'జాక్ మా' నిన్న ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఆయన రెండో సారి భారత పర్యటనకు వచ్చారు. గతంలో వచ్చినప్పుడు ప్రధానితో భేటీ అయ్యే అవకాశం ఆయనకు చిక్కలేదు. తాజా భేటీలో చిన్న సంస్థలకు తోడ్పాటు అంశం ప్రధానంగా చర్చకు వచ్చినట్లు అలీబాబా గ్రూప్ ఆ తర్వాత ట్విట్టర్ లో తెలిపింది. ఇప్పటికే పలు భారతీయ సంస్థలకు చెందిన ఉత్పత్తులను విక్రయిస్తున్న అలీబాబా.కామ్, ఇకపై మరిన్ని సంస్థలకు తన సేవలను విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది.ఈ క్రమంలో భారీ పెట్టుబడులను పెట్టడమే కాక, భారత్ కు చెందిన పలు సంస్థలను టేకోవర్ చేసే దిశగా యోచిస్తోంది.

  • Loading...

More Telugu News